సమీక్ష : బెజవాడ-పస లేని బెజవాడ

సమీక్ష : బెజవాడ-పస లేని బెజవాడ

Published on Dec 1, 2011 7:32 PM IST
విడుదల తేది : 01 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : వివేక్ కృష్ణ
నిర్మాత :రాంగోపాల్ వర్మ , కిరణ్ కుమార్ కోనేరు
సంగిత డైరెక్టర్ : అమర్ మొహిలే , తుతుల్
తారాగణం : నాగ చైతన్య , అమల పుల్ , అంజన సుఖాని , ప్రభు , ముకుల్దేవ్ , అభిమన్యు సింగ్ , సుభాలేక సుధాకర్ , కోట శ్రీనివాస రావు , ఆహుతి ప్రసాద్ , బ్రహ్మానందం

నాగ చైతన్య నటించిన ఏ మాయ చేసావే, 100% లవ్ వంటి లవ్ స్టోరీ సినిమాలతో విజయం సాధించిన సాధించాడు.తరువాత దడ వంటి యాక్షన్ సినిమా నిరాశ పరిచినా మళ్లీ అదే టైపు యాక్షన్ సినిమా ‘బెజవాడ’ తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ: కాళి (ప్రభు) బెజవాడలో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాడు. విజయ కృష్ణ (ముఖుల్ దేవ్) మరియు అతని తమ్ముడు జయ కృష్ణ (అజయ్) కాళి కి అనుచరులుగా ఉంటారు. కాళి సెటిల్మెంట్లలో విజయకృష్ణ కి ప్రాధాన్యత ఇస్తూ ఉండటం కాళి తమ్ముడు శంకర్ (అభిమన్యు సింగ్) నచ్చదు. విజయకృష్ణ తమ్ముడు శివ (నాగ చైతన్య) కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. తన కాలేజ్ ఫ్రెండ్ అయిన గీత (అమలా పాల్) ని లవ్ చేస్తాడు. గీత ఎవరో కాదు బెజవాడ సిటీ కమీషనర్ అయిన అది విష్ణు (ఆహుతి ప్రసాద్) కూతురు. ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న శంకర్, కాళికి మరియు విజయకృష్ణ మధ్యలో చిచ్చు పెట్టె ప్రయత్నాలు చేస్తుంటాడు. రమణ (కోట) తో కలిసి ఒక భారీ కుట్ర చేస్తాడు. ఏంటి ఆ కుట్ర అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ బావుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాల్లో మరియు శుభలేఖ సుధాకర్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో చాల బాగా చేసాడు. యాక్షన్ సన్నివేశాల్లో తన గత సినిమా దడ కంటే ఇంప్రూవ్ అయ్యాడు. వైట్ ఖద్దరు డ్రెస్ లో బావున్నాడు. అతను శివ కృష్ణ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. అమలా పాల్ కూడా బాగా చేసింది. రెండు పాటల్లో చాలా అందంగా కనిపించింది. పవర్ ఫుల్ కాళి పాత్రలో ప్రభు బాగా చేసాడు. విజయకృష్ణగా ముకుల్ దేవ్, జయకృష్ణగా అజయ్ తమ పాత్రకు న్యాయం చేసారు. రాజకీయ నాయకుడు రమణగా కోట, సాగర్ రాజుగా శుభలేఖ సుధాకర్ భాగానే చేసారు. బ్రహ్మానందం చేసిన రక్త చరిత్ర సినిమాలోని వివేక్ ఒబెరాయ్ గెటప్ లో స్కూటర్ మీద వచ్చే సన్నివేశం బాగా నవ్విస్తుంది.

మైనస్ పాయింట్స్: ఈ సినిమాలో మెయిన్ విలన్ అయిన అభిమన్యు సింగ్ ని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. రక్త చరిత్రలో అతను చేసిన అధ్బుతమైన పెర్ఫార్మన్స్ తరువాత ప్రేక్షకులు అతని నుండి చాలా ఆశించారు. ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. సినిమా మొదటి భాగంలో హీరోయిజం లేకపోవడం,
రెండవ భాగంలో హీరో పవర్ ఫుల్ గా మారుతున్నపుడు విలన్ ని బఫూన్ లా చూపించడం అస్సలు రుచించలేదు. వివేక్ కృష్ణ డైరెక్షన్ ఈ సినిమాకి మెయిన్ మైనస్. కొన్ని పవర్ ఫుల్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు తీయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. స్కెచ్ గోపిగా బ్రహ్మానందం మరియు వీర వెంకట ప్రసాద్ గా ఎమ్మెస్ నారాయణ చేసిన సపరేట్ కామెడీ ట్రాక్ చిరాకు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం: ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ అందించిన పాటల్లో ఒకటి పరవాలేదనిపించగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగాలేదు. గౌతమ్ రాజు ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఎస్,కే భూపతి అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు. డైలాగులు బాగానే ఉన్న అవి ఎలివేట్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.

తీర్పు: బెజవాడ సినిమా కథ బావున్నప్పటికీ స్క్రీన్ప్లే మరియు డైరెక్షన్ సరిగా లేకపోవడం తో పేలవంగా మారిపాయింది. నాగ చైతన్య, ముకుల్ దేవ్ నటన బాగానే ఉన్నా విలన్ కారెక్టర్ పవర్ ఫుల్ గా లేకపోవడంతో కూడా తేలిపాయింది. నాగ చైతన్యకి నటిస్తున్న తరువాత సినిమా ‘ఆటో నగర్ సూర్య’ అయిన మాస్ హీరోగా బ్రేక్ ఇవ్వాలని ఆశిద్దాం.

అశోక్ రెడ్డి . ఎం

123తెలుగు.కాం రేటింగ్: 2 .75/5

Bezawada Review For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు