‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. ఎప్పుడు రావొచ్చంటే..?

‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. ఎప్పుడు రావొచ్చంటే..?

Published on Sep 11, 2026 11:01 PM IST

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ ‘రాకా’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది దసరా నాటికి పూర్తి చేయాలని మొదట భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల షెడ్యూల్ ఆలస్యమైంది.

ప్రస్తుతం జరుగుతున్న లెక్కల ప్రకారం, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. భారీ వీఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ పనులు ఉండటంతో, పోస్ట్-ప్రొడక్షన్ కోసం అట్లీ ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
​దీంతో ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా మేకర్స్ స్పష్టతనిచ్చారు.

అనుకున్న దానికంటే షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో 2027 క్రిస్మస్ రేసు నుంచి ఈ మూవీ తప్పుకుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే అధికారిక తేదీని ప్రకటించనుండగా, ప్రస్తుతానికి 2028 రిపబ్లిక్ డే లేదా అదే ఏడాది సమ్మర్ కానుకగా ‘రాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు