సమీక్ష : దేవరాయ – పూర్ సోషియో ఫాంటసీ మూవీ

సమీక్ష : దేవరాయ – పూర్ సోషియో ఫాంటసీ మూవీ

Published on Dec 7, 2012 9:00 PM IST
విడుదల తేదీ: 07 డిసెంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : నానిక్రిష్ణ
నిర్మాత : కిరణ్ జక్కం శెట్టి, నానికృష్ణ
సంగీతం : చక్రి
నటీనటులు : శ్రీ కాంత్, విదిష, మీనాక్షి దీక్షిత్

100 సినిమాల మార్క్ క్రాస్ చేసిన ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ తొలిసారిగా చేసిన సోషియో ఫాంటసీ చిత్రం ‘దేవరాయ’. ఈ సినిమాలో శ్రీ కాంత్ ఆంధ్ర భోజ శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో మరియు అల్లరిగా తిరిగే దొరబాబు అనే రెండు విభిన్న పాత్రలు పోషించాడు. విదిష, మీనాక్షి దీక్షిత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా నానిక్రిష్ణ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కిరణ్ జక్కంశెట్టి – నానిక్రిష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. శ్రీ కాంత్ తన కెరీర్లో మొదరి సారిగా చేసిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

విలేజ్ లో అల్లరి చేస్తూ హ్యాపీ గా లైఫ్ ని గడిపేస్తుంటాడు దొరబాబు(శ్రీ కాంత్). అలాంటి దొరబాబు స్వప్న(విదిష)తో ప్రేమలో పడతాడు, తను కూడా దొరబాబులోని మంచి యాంగిల్ ని చూసి ప్రేమిస్తుంది. దొరబాబుని మార్చాలనుకుంటుంది కానీ ఆమె తాత (రంగనాథ్) అందుకు ఇష్టపడడు. ఇలా కథ జరుగుతూ ఉండగా పురావస్తు శాస్త్రజ్ఞుడు (శివాజీ రాజా) గోదావరి డెల్టా ప్రాంతంలో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో జరిగిన ఓ విషయాన్ని గురించి పరిశోధన చేయాలనుకుంటుంటాడు. రంగనాథ్ సహాయంతో ఆంధ్రభోజుడి పురాతన డైరీని అనువదించాలనుకుంటాడు.

అది అనువదించిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అందులో దొరబాబుకి శ్రీ కృష్ణదేవరాయలుతో సంబంధం ఉందని తెలుస్తుంది. అతను చెయ్యాలనుకొని చెయ్యలేని పనులను దొరబాబు పూర్తి చేయాలనుకుంటాడు. అసలు అతను ఎం చెయ్యాలనుకున్నాడు అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమా పరంగా శ్రీ కాంత్ నటన ఓకే అనేలా ఉంది. దొరబాబు పాత్రలో కామెడీ చెయ్యాల్సినప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఎక్కువగా ఇమిటేట్ చేసాడు. అలాగే శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో సీనియర్ ఎన్.టి.ఆర్ గారిని అనుసరించాడు. విదిష బాగుంది మరియు మంచి సినిమాలను ఎంచుకుంటే ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉంటుంది. మీనాక్షి దీక్షిత్ పరవాలేదనిపించింది.

విలక్షణ నటులు బాలయ్య, రంగనాథ్, శివాజీ రాజా, ఎమ్.ఎస్ నారాయణ, రఘు కురుమంచి మరియు జయప్రకాశ్ రెడ్డి వాలా పరిధి మేరకు పాత్రలకు తగ్గట్టు బాగా నటించారు. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ మరియు దేవరాయల సంస్థానంలో చిత్రీకరించిన సీన్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా కోసం ఎంచుకున్న స్టొరీ లైన్ లోనే చాలా బొక్కలున్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో అసలు కథ ఏమీ ఉండదు దానికి తగ్గట్టుగానే వరుసగా పాటలు వచ్చి తెగ చిరాకు పెడతాయి. సీన్స్ కూడా చాలా పాతగా మరియు లాజిక్ లేకుండా ఉంటుంది. మీరు శ్రీ కృష్ణ దేవరాయలకి పెద్ద ఫ్యాన్ అయితే ఈ సినిమా చూసి ఖచ్చితంగా భాదపడతారు. ఫ్లాష్ బ్యాక్లో శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పే డైలాగ్స్ గ్రాంధికంలో ఉండకుండా ఇప్పటికి తగ్గట్టుగా ఉంటాయి.

జయప్రకాష్ తమ్ముడిగా కనిపించిన నటుడికి పెట్టిన విగ్గు చాలా కామెడీగా ఉంటుంది. సినిమాలో పాటల ప్లేస్ మెంట్ అస్సలు బాలేదు. సినిమా ఇప్పుడే ఊపందుకుంటోంది అనుకునే టైంలో పాట వచ్చి ఆ ఫీల్ ని పోగొడుతుంది. కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు చాలా పేలవంగా ఉంటాయి కానీ అది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సినిమాని తక్కువ బడ్జెట్ తో తీసారు.

సాంకేతిక విభాగం :

నానిక్రిష్ణ డైరెక్షన్ చెప్పుకునేంతగా లేదు, అలాగే కథలోని ప్రధాన అంశాలను కూడా కరెక్ట్ గా డీల్ చెయ్యలేదు మరియు స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది కానీ వీరబాబు డైలాగ్స్ ఆకట్టుకునేలా లేవు. ఇంతకముందు అన్నట్టుగానే చక్రి మ్యూజిక్ బాలేదు మరియు అతని మ్యూజిక్ సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ప్రొడక్షన్ విలువలు పరవాలేదనిపించేలా ఉన్నాయి.

తీర్పు :

శ్రీ కాంత్ కి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ఉంది, అలాంటి హీరోని ఇలాంటి సినిమాల్లో చూడాల్సి రావడం బాధపడాల్సిన విషయం. ‘దేవరాయ’ గురించి చెప్పాలంటే చూడటానికి ఏమీ లేని సినిమా. మీకు వీలైతే ఈ సినిమా చూడకండి, ఒకవేళ మీకు చూడాలి అనిపిస్తే డైరెక్టర్ ఏమి చెప్పాలనుకున్నాడు అనే విషయాన్ని వదిలేసి మామూలుగా సినిమా చూడండి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

Translated by – Rag’s

Click Here For ‘Devaraya’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు