సమీక్ష : మల్లిగాడు – తెలుగు ప్రేక్షకులకు రుచించని చిత్రం

సమీక్ష : మల్లిగాడు – తెలుగు ప్రేక్షకులకు రుచించని చిత్రం

Published on Mar 2, 2012 8:22 PM IST
విడుదల తేది : 2 మార్చి 2012
123తెలుగు.కాం రేటింగ్: 2.5/5
దర్శకుడు : అమీర్ సుల్తాన్
నిర్మాత : ఆర్ తంగ ప్రబాకరన్
సంగిత డైరెక్టర్ : యువన్ శంకర్ రాజ
తారాగణం : కార్తి, ప్రియమణి, సరవనన్

మల్లిగాడు చిత్రం తమిళం లో జాతీయ అవార్డు దక్కించుకున్న చిత్రం “పరుత్తి వీరన్” కు అనువాదం. కార్థిఒ మరియు ప్రియమణి లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం కార్తి కి తొలి చిత్రం ఈ చిత్రానికి అమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించగా జ్ఞానవేల్ రాజ నిర్మించారు యువన్ శంకర్ రాజ సంగీతం అందించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

మల్లి బాబు(కార్తి) ఆ ఊర్లో రౌడీ షీటర్ లా తిరిగేవాడు తన మావయ్య శివయ్య(శరవణన్) తో కలిసి తను రోజు ఏదో ఒక చట్ట వ్యతిరేకమయిన పనులు చేస్తుండేవాడు మల్లి బాబు ఆ ఊర్లో జులాయి ల తిరుగుతుంటాడు ఇతనంటే అంటే మల్లి (ప్రియమణి)కి ఇష్టం ఉంటుంది కాని చెప్పదు మరో పక్క మల్లి తండ్రి అయిన నాగయ్య ( పోన్ వన్నన్) కి మల్లి బాబు నచ్చడు. దీనికి మాలి బాబు ప్రవర్తన మరియు తక్కువ కులం వాడు అని కారణం. చిత్రం మొత్తం తక్కువ కులం వాడని వారి మధ్య జరిగే మనోభావాల మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్ర కథా నేఫధ్యం. మల్లి బాబు ఎప్పుడయితే మల్లి ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడో ఆ గ్రామం లో అందరు అతన్ని ద్వేషించడం మొదలు పెడతారు. అతడు మల్లిని పెళ్లి చేసుకున్నాడా? మల్లి బాబు మరియు మల్లి వారి కలల జీవితాన్ని చేరుకున్నారా? ఆ గ్రామం వారిని ప్రశాంతంగా ఉండనిచ్చిందా? అనేది మిగిలిన కథాంశం.

ప్లస్:

మల్లి బాబు పాత్రలో కార్తి అద్బుతంగా నటించారు అద్బుతమయిన నటన తో అందరిని ఆకట్టుకున్నారు. ప్రియమణి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించింది తన నటనతో అందరిని అబ్బురపరిచింది ఇప్పటి ప్రియమణి ని చూసి ఈ చిత్రం లో ప్రియమణి ని చూస్తే ఈమెలో నటి ఏమయిపోయింది అనే భావన కలుగుతుంది అంతలా అలరించింది. పోన్ వన్నన్ మరియు శరవణన్ వారి పాత్ర మేరకు అలరించారు. నటనా పరంగా ప్రతి ఒక్కరు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు రెండవ అర్ధం లో కొన్ని వెన్నాడె సన్నివేశాలు ఉన్నాయి చిత్రం లో కార్తి ప్రియమణి ప్రేమను ఒప్పుకున్నాక చిత్రం కాస్త ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

మైనస్:

ఈ చిత్రం అవార్డు గెలుచుకున్న చిత్రమే అయిన ఇందులో విపరీతమయిన తమిళ ప్రాంతీయతతో చిత్రీకరించారు తెలుగు ప్రజలు చిత్రం లో కన్నేచ్ట్ అవ్వటం అసాధ్యం. ఇందులే వస్త్ర ధారన్ కూడా తమిళ పల్లెటూర్లలో మాదిరిగా ఉపయోగించారు తెలుగు ప్రజలకు అసలు రుచించదు. ప్రియమణి కావాలనే కాస్త తక్కువ అందంగా చూపించటం కార్తి వస్తారు జురి అవార్డు ల కోసం అయితే పర్లేదు కాని తెలుగు లో కమర్షియల్ చిత్రాలకు అసలు సరిపోదు కొని సన్నివేశాలు తెలుగు లో అసలు ఆమోదించనివి ఉదాహరణకు ఒక చనిపోయే అమ్మాయిని అల చూపించటం తెలుగు ప్రజలు అసలు ఆమోదించరు. చిత్ర కథ చెప్పిన విధానం చాలా నెమ్మదిగా సాగుతుంది కాస్త బోర్ కొట్టిస్తుంది చిత్ర క్లైమాక్స్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

సాంకేతిక అంశాలు:

సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉంది చిత్రం లో కొన్ని సన్నివేశాలు ఎక్కడయితే బ్లాకు అండ్ వైట్ ఉపయోగించారు ఆ సన్నివేశాలు మిమ్మల్ని వెన్నాడుతూనే ఉంటాయి. నేఫధ్య సంగీతం చాలా బాగుంది చిత్రం లో కొన్ని పాటలు చాలా బాగున్నాయి మిగిలినవి పరువాలేదు. ఎడిటింగ్ కాస్త బాగుందాల్సింది. మాటలు ఇంకాస్త బాగుండాల్సింది.

తీర్పు :

మల్లిగాడు అద్బుతమయిన నటనలతో కూడిన చిత్రం కాని మన తెలుగు పరిశ్రమ మార్కెట్ కి అస్సలు సరిపోని ఒక చిత్రం. తమిళం లో చాలా అవార్డు లు గెలుచుకున్నా ఈ చిత్రం లో తమిళ ప్రాంతీయత విపరీతంగా చూపించడం వాళ్ళ మన ప్రేక్షకులు అస్సలు చూడలేరు. దానితో పాటు ఈ చిత్రం మిమ్మల్ని కాస్త దిగ్బ్రాంతి కి లోను చేస్తుంది. ఈ చిత్రాన్ని చూడకపోవడమే మంచిది. మీరు తమిళ ప్రాంతీయతను అభిమానిన్చేవారయితే చూడచ్చు.

123తెలుగు.కాం రేటింగ్ : 2.5/5

అనువాదం : రవి

Clicke Here For ‘Malligadu’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు