సమీక్ష : ప్రేమలో ఏబిసి – ఊహించదగిన కథ

సమీక్ష : ప్రేమలో ఏబిసి – ఊహించదగిన కథ

Published on Jul 25, 2014 9:40 AM IST
Premalo-abc-2 విడుదల తేదీ : 25 జూలై 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : నాగరాజు
నిర్మాత : జేవి రెడ్డి
సంగీతం : ఎలేందర్
నటీనటులు : అజయ్, రిషి, క్రాంతి, శ్రీ లేర

ప్రతివారంలానే, ఈ వారం కూడా మరో లో బడ్జెట్ సినిమా విడుదలైంది. ఎప్పుడు విలన్ పాత్రలో కనిపించే ప్రముఖ నటుడు అజయ్ ముఖ్య పాత్రలో నటించిన ప్రేమలో ఏబిసి సినిమాకు నాగరాజు దర్శకత్వం వహించాడు. జేవి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పడు చూద్దాం..

కథ :

అజయ్(క్రాంతి), బాలు, చందులు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు అజయ్ సిరి(శ్రీ ఐరా)ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి సిరి కూడా అజయ్ ని ప్రేమిస్తుంది. కట్ చేస్తే చందు – సిరి కలిసి తన దగ్గర ఉన్న డబ్బు కోసం తనని మోసం చేసాడని తెలుసుకుంటాడు. ఇలా జరిగిన కొద్ది రోజులకి ఒక రోజు రాత్రి సిరి – చందులు వేరే వాళ్ళ చేతిలో చంపబడతారు. అప్పుడే ఈ కేసుని డీల్ చెయ్యడానికి ఏసిపి రణధీర్(అజయ్) రంగంలోకి దిగుతాడు.

అసలు సిరి, చందులను చంపింది ఎవరు? అజయ్ ని సిరి, చందులు కలిసి మోసం చేయడానికి గల కారణం ఏమిటి? వీరిద్దరికీ ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే అదేమిటి? అసలు ఈ మర్డర్స్ వెనకున్న వారిని ఏసిపి రణధీర్ పట్టుకోగలిగాడా? లేదా అన్నది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఎక్కువగా నెగటివ్ రోల్స్ లో కనిపించే అజయ్ ఈ సినిమాలో పవర్ఫుల్ ఏసిపి పాత్రలో కనిపించాడు. అతని సీరియస్ యాక్షన్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకి ప్రధాన హైలైట్. అలాగే ఈసినిమాలో కాస్త గుర్తింపు ఉన్న రిషి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా చేసాడు. మిగతా నటీనటులు కూడా ఉన్నంతలో బాగా చేసారు. బోరింగ్ ఎలిమెంట్స్ నుంచి మిమ్మల్ని శ్రీనివాస్ రెడ్డి – ధన్ రాజ్ కాంబినేషన్ సీన్స్ ఆడియన్స్ కి రిలీఫ్ ఇవ్వడమే కాకుండా బాగా నవ్విస్తాయి. సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ని చాలా ఆసక్తి కరంగా తీసారు. అవి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ డ్రా బ్యాక్ అంటే సినిమా చాలా చాలా స్లోగా ఉండడం, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్. కథ అసస్లు ముందుకు వెళ్ళదు. ఇంటర్వల్ దగ్గరే డైరెక్టర్ అసలు కథ చెప్పడం మొదలు పెట్టాడు. దాంతో మొదటి గంట సేపు ఆడియన్స్ బాగా బోరింగ్ గా ఫీలవుతారు. అనవసరంగా సీన్స్ అవసరం లేకపోయినా బలవంతంగా పెట్టడం, ఉన్న సీన్స్ ని మరింత సాగదీయడం లాంటివి ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయి. క్రాంతి – శ్రీ ఐరా కెమిస్ట్రీ అస్సలు బాలేదు. ఈ సినిమా సెకండాఫ్ లో కొన్ని ట్విస్ట్ లు ఉన్నాయి కానీ ఆడియన్స్ మాత్రం వాటిని ఈజీగా ఊహించేయగలరు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువైపోవడం, రిపీటెడ్ సీన్స్ కూడా బాగా ఎక్కువ కావడం వలన సినిమా ఫ్లో బాగా దెబ్బతింటుంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలోని పాటలు యావరేజ్ గా ఉన్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్ గా ఉంది. చాలా సీన్స్ సినిమాటోగ్రఫీ అస్సలు బాలేదు. కొన్ని సీన్స్ లో ఓకే. ఎడిటింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ ని కత్తిరించి పారేయాల్సింది. స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకోవాలనే ఉద్దేశంతో మరిన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పెట్టి ఆడియన్స్ ని బాగా కన్ఫ్యూజ్ చేసారు. రెగ్యులర్ స్టొరీని తీసుకొని కొత్తగా చెప్పాలనుకున్న డైరెక్టర్ నాగరాజు సరిగా హాండిల్ చేయలేకపోయాడు.

తీర్పు :

ఈ వారం విడుదలైన లో బడ్జెట్ సినిమా ‘ప్రేమలో ఎబిసి’ చివరికి రొటీన్ మరియు బోరింగ్ ఎబిసిగా ముగిసింది. ఈ సినిమాకి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అజయ్. బోరింగ్ ఫస్ట్ హాఫ్, కనెక్ట్ కాని ఎమోషన్స్, ఊహాజనితంగా ఉండే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. మీరు మరింత సహన శీలి అయితే ఈ సినిమాకి వెళ్లి ఓపిగ్గా తిలకించవచ్చు.

123తెలుగు రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

 

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు