హిందీ చిత్రాన్ని అంగీకరించిన స్నేహా ఉల్లాల్

sneha-ullal
చాలాకాలం విరామం తరువాత స్నేహా ఉల్లాల్ ఒక హిందీ సినిమాను అంగీకరించింది. 2005లో సల్మాన్ ఖాన్ సరసన లక్కీ సినిమాతో ప్రారంభమైన ఆమె సినిమా ప్రస్తానం ఆ తరువాత వరుసపెట్టి తెలుగు సినిమాలకు తన కాలాన్ని వెచ్చించింది. ఇప్పుడు బేజుబాన్ ఇష్క్ అనే సినిమాలో ఈ భామ నటించనుంది

ఈ వారంనుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వివరాలు త్వరలోనే తెలుపుతారు. స్నేహ లెక్క ప్రకారం ఆమెకిది రెండో ఇన్నింగ్స్ తో సమానమాట. బెల్లీ డ్యాన్స్ నేర్చుకుని తిరిగి నాజుకైనా శరీరం పొందమని సల్మాన్ ఖాన్ దగ్గరుండి చెప్పాడట. నడుం నొప్పి కారణంగా స్నేహ తెలుగు ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు వదులుకుంది

ఆమె ఆఖరి సినిమా యాక్షన్ ౩D, త్వరలో ఈ భామ నవదీప్ సరసన అంతా నీ మాయలోనే సినిమాతో మనముందుకురానుంది

Exit mobile version