
చాలా కాలం నుంచి పెళ్లి జరుగుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాణి ముఖర్జీ పెళ్లి ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్,
యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాతో జరిగింది. గత కొద్ది రోజులుగా ఆదిత్య చోప్రా – రాణి ముఖర్జీ పెళ్లి ఇదిగో అదిగో అని వస్తున్న వార్తలకు ఈ పెళ్ళితో వీరు తెరదించారు.
ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆదిత్య చోప్రా – రాణి ముఖర్జీ పెళ్లి నిన్న రాత్రి ఇటలీలో జరిగింది. ఈ వివాహ వేడుక చాలా సింపుల్ గా కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో జరిగింది.
గత 6 సంవత్సరాలుగా ఒక రిలేషన్ లో ఉన్నవీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య చోప్రాకి ఇది సెకండ్ మ్యారేజ్. మొదటి భార్తఃతో ఆదిత్య చోప్రా ఎప్పుడు విడాకులు తీసుకున్నాడు.