
తెలుగు వారికి బాగా సుపరిచితుడైన తమిళ సూపర్ స్టార్ సూర్య ప్రస్తుతం అంజాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఫైట్ మాస్టర్ సెల్వ నేపధ్యంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు సూర్య గాయాలపాలయ్యాడని, షూటింగ్ ఆగిపోయిందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ విషయాల్లో వాస్తవం లేదని ఈ చిత్ర టీం ఖరారు చేసింది. ‘సూర్యకి ఎలాంటి గాయాలు తగలలేదు, ఆయన చాలా క్షేమంగా ఉన్నాడు. బయట వస్తున్నా వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమే. ప్రస్తుతం గోవాలో సెల్వ మాస్టర్ నేతృత్వంలో క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నామని’ అంజాన్ టీం తెలిపింది. ఇదే విషయాన్నీ డిస్నీ – యుటివి సౌత్ హెడ్ అయిన ధనంజయన్ కూడా ఖరారు చేసారు.
సూర్య రెండు విభిన్న గెటప్స్ లో కనిపించనున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.