
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా ‘రభస’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అందులోనూ క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ రభస సినిమా ఇప్పటికే పలు కారణాల వాళ్ళ ఆలస్యమైనందువల్ల, సినిమాని త్వరగా ఫినిష్ చేసి గుమ్మడికాయ కొట్టేయాలనే ఉద్దేశంతో ఎన్.టి.ఆర్ ఎండలు మండుతున్నా షూటింగ్ చేస్తున్నారు.
సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కామెడీ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.