
యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన రెండవ సినిమా ‘కొత్త జంట’ నిన్న విడుదలైంది. మొదటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ బాగుందని చాలా మంది విమర్శకులు అంటుండడంతో అల్లు శిరీష్ కాస్త టెన్షన్ నుంచి బయటపడ్డాడు. అలాగే సినిమాకి కూడా మిక్స్డ్ టాక్ రావడంతో హ్యాపీగా ఉన్నాడు.
శిరీష్ నటించిన మొదటి సినిమా గొరవం లో అతని నటనకి మంచి మార్కులు పడలేదు అలాగే సినిమా కూడా విజయవంతం కాలేదు. కానీ మారుతి తీసిన కొత్త జంట ఆ రెండు విషయాల్లోనూ అల్లు శిరీష్ ని కొంతవరకూ సంతృప్తి పరిచింది. తనలో ఇంకా మెరుగు పరుచుకోవాల్సినవి చాలా ఉన్నా సెకండ్ ఫిల్మ్ లో కొంత వరకూ మెరుగుపరుచుకున్నాడు. రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బన్నీ వాసు నిర్మాత.