
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కమల్ హసన్ తదుపరి చిత్రం ‘ఉత్తమ విలన్’ సెప్టెంబర్లో విడుదల అవనుంది. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని లింగు స్వామి నిమిస్తున్నారు. పూజ, ఆండ్రియా, పార్వతి, ఊర్వశి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లోని ఒక పాట చిత్రీకరణ టర్కీలో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం వరకు కమల్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ బెంగళూరులోని ఒక మాల్ లో చిత్రీకరించారు. ఈ సినిమాలో కమల్ హసన్ వృద్ధ సూపర్ స్టార్ మరియు ‘తెయ్యం’ ఆర్టిస్ట్ గా రెండు బిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. ఈ రెండు క్యారెక్టర్లను ఎలా లింక్ చేశారో వేచి చూడాలి.
కమల్ హసన్ రచించిన ఈ సినిమాలో కె బాలచందర్ మరియు కె విశ్వనాధ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.