
తమిళ్ హీరో విక్రమ్ తదుపరి సినిమా జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికి తను శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘మనోహరుడు’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. విమర్శల ప్రశంసలు అందుకున్న ‘గోలి సోడా’ సినిమాను డైరెక్ట్ చేసిన విజయ్ మిల్టన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సరసన సమంతా హీరొయిన్ గా నటించనున్నట్లు సమాచారం.
ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలోని కొంత బాగాన్ని టర్కీలో తియనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికోసం విక్రమ్ జూన్ లో టర్కీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఏఅర్ మురుగదాస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. డి ఇమ్మామ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ కు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘మనోహరుడు’ సినిమాతో ఆ లోటు తీరుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా జూన్ లేదా జులై నెలలో విడుదల అవనుంది. బారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది.