‘బాహుబలి’ షెడ్యూల్ పూర్తి చేసిన రానా

rana
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొట్ట మొదటి సారిగా అత్యంత భారీ బడ్జెట్ తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బాహుబలి’.
సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, రానా హీరోలుగా నటిస్తున్నారు. ఇటీవలే ఓ భారీ వార్ ఎపిసోడ్ ని పూర్తి చేసింది. ఆ తర్వాత చిన్నపాటి విరామం తీసుకున్న ఈ చిత్ర టీం ఏప్రిల్ 19 నుండి మరో షెడ్యూల్ ని ప్రారంభించింది.

నేటితో రానా దగ్గుబాటి ఈ షెడ్యూల్ కి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసాడు. ‘బాహుబలి లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసాను. మళ్ళీ కొద్ది నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటాను. అలాగే జూన్ మధ్యలో ఓ కొత్త సినిమా మొదలు పెడతాను. దాని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని’ రానా ట్వీట్ చేసాడు. ఈ షెడ్యూల్ లో రానా పార్ట్ పూర్తయినప్పటికీ మిగతా నటీనటులపై రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ సినిమా 2015లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version