
మేము నిన్న చెప్పినట్లుగానే రజినీకాంత్ ‘విక్రమసింహా’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. టెక్నికల్ గా వచ్చిన కొన్ని సమస్యల వల్లే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అలాగే వాయిదా వేసిన ఈ మూవీని మే 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇండియాలో మొట్ట మొదటి సారిగా మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమాకి సౌందర్య రజినీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించింది. రజినీకాంత్ తో పాటు దీపిక పడుకొనె, శోభన, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.