వి.వి వినాయక్ సినిమా కోసం ఇటలీ వెళ్లనున్న సమంత

samantha
చేతినిండా సినిమాలతో సమంత ఈ ఏడాది బిజీగా వుంది. తెలుగు, తమిళ వెర్షన్ లలో భారీ చిత్రాలలో ఈ భామ నటిస్తుంది. ఇటీవలే అలెప్పీ వెళ్ళిన ఈ భామ ఇప్పుడు త్వరలో వి.వి వినాయక్ సినిమా కోసం ఇటలీ వెళ్లనుంది

ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటలీలో అందమైన లోకేషన్ల మధ్య వీరిపై ఒకపాటను తెరకెక్కించనున్నారు. ఈ మధ్య డ్యాన్సింగ్ లో బిజీగా వున్నట్లు, ఇప్పుడు కూడా ఇటలీకి డ్యాన్సింగ్ కి వెళ్లనున్నట్లు సమంత ట్విట్టర్ లో పేర్కొంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత

ఇదిలావుండగా సమంత సూర్య జంటగా నటిస్తున్న అంజాన్, విజయ్ తో కలిసి నటిస్తున్న కత్తి సినిమాలో ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధంగా వున్నాయి

Exit mobile version