మెగా బ్రదర్స్ త్వరలో కలవనున్నారా?

chiru-pawan
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మెగా అభిమానులకు మంచి రోజులు రానున్నాయని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా రాజకీయ పరిస్థితుల వల్ల మెగా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చాయి. మేము విన్న తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ – చిరంజీవిలు తమ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను క్లియర్ చేసుకోవడానికి సిద్దమవుతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రచారం టిడిపికి చేసిన ప్రచారం సూపర్ హిట్ అయ్యింది, కానీ చిరంజీవి కాంగ్రెస్ కోసం చేసిన ప్రచారం పెద్దగా సక్సెస్ కాలేదు. వీరిద్దరూ ఇప్పటివరకూ జరిగిన విషయాలను పక్కన పెట్టాలనుకోవడం మంచి స్టెప్ అని చెప్పాలి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లేదని తెలియడంతో చిరంజీవి కూడా పబ్లిక్ గా తన బ్రదర్ కి సపోర్ట్ ఇచ్చి, మళ్ళీ సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ మెంబర్ గా ఉండాలనుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ వార్త మెగా అభిమానుల్లో తిరుగుతోంది. మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కసారి కలిసిన తర్వాత ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Exit mobile version