
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘జంప్ జీలాని’ సినిమా జూన్ నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ని మే 23న, అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించిన ‘మనం’ సినిమాతో పాటు విడుదల చేయనున్నారు. ‘జంప్ జీలాని’, ఈ కామెడీ సినిమాలో అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాటలు త్వరలో విడుదల కానున్నాయి.
తమిళ్ ‘కలకలప్పు’ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ ‘జంప్ జీలాని’లో ఇషా చావ్లా హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ ఎబెనేజేర్ ఈ సంగీతం సమకూరుస్తున్నారు.