
టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా రాజమౌళి ఫ్యామిలీ సభ్యుల మధ్య జరిగిన ఫిల్మ్ మేకింగ్ డిష్కషన్ లో కీరవాణి చెప్పిన గోల్డెన్ రూల్ సూపర్బ్ గా ఉందని రాజమౌళి అంటున్నాడు. ‘నిన్న ఫిల్మ్ మేకింగ్ పై జరిగిన డిష్కషన్ లో పెద్దన్న ఒక గోల్డెన్ రూల్ చెప్పాడు. అది సూపర్బ్ గా ఉంది. అదేమిటంటే ప్రేక్షకులు నీపై అంచనాలను పెట్టుకున్నారంటే వాటిని రీచ్ అవ్వు, కానీ వాళ్ళు ఎం చూపించానున్నావో ఊహించగలితే అప్పుడు వాళ్ళని సర్ప్రైజ్ చెయ్ అని’ కీరవాణి చెప్పిన గోల్డెన్ రూల్ ని రాజమౌళి ట్వీట్ చేసాడు.
ప్రభాస్ కి జరిగిన చిన్న షోల్డర్ సర్జరీ వల్ల బాహుబలి షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చారు. ప్రభాస్ తో పాటు రానా కూడా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2015లో రెండు పార్ట్స్ గా విడుదల కానుంది.