తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసిన రజినీకాంత్

rajnikanths_Kochadaiiyaan
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ అలియాస్ తలైవా సినిమా రిలీజ్ అవుతోంది అంటే అంతక ముందు ఉన్న రికార్డులన్నీ బద్దలైపోతాయని అందరికీ తెలిసన విషయమే. ఈ వారం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కొచ్చాడియాన్’ సినిమా కూడా రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. అది కూడా రజినీ రికార్డ్ ని రజినీనే బ్రేక్ చేస్తుండడం విశేషం.

ఇండియాలోనే 16 స్క్రీన్స్ కలిగిన బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ అయిన మాయాజల్ చెన్నైలో ఉంది. గతంలో రజినీ నటించిన ‘ఎంధిరన్(రోబో)’ సినిమాని ఈ మాయజల్ లో మొదటి రోజు16 స్క్రీన్స్ లో కలిపి 90 షోలు వేసారు. ఇప్పుడు ఆ రికార్డ్ ని రజినీ ‘కొచ్చాడియాన్’ సినిమాతో బ్రేక్ చేస్తున్నాడు. మే 23న మాయాజల్ లో 16 స్క్రీన్స్ లో కలిపి 100 షో లు వేయడానికి ప్లాన్ చేసారు.

మాయాజాల్ వాళ్ళు ముందుగా కొచ్చాడియాన్ రిలీజ్ రోజు 74 షోలు ప్లాన్ చేసారు. కానీ తాజాగా ఆ షౌస్ ని 100కి పెంచుతున్నామని తెలిపారు. తెలుగులో ‘విక్రమసింహా’ గా రానున్న ఈ సినిమాకి సౌందర్య అశ్విన్ డైరెక్టర్.

Exit mobile version