మహేష్ బాబు 2013 మోస్ట్ డిజైరబుల్ మాన్

mahesh_babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో అందగాడు ఈ విషయంలో అసలు సందేహం లేదు. పలుసార్లు ఇండియా యొక్క మోస్ట్ డిజైరబుల్ మెన్ చార్ట్ లో అగ్రస్థానాన్ని సంపాదించారు. మరోసారి ఈ ఫీట్ ని మహేష్ సాధించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా జరిపిన ఒక పోల్ ద్వారా పాఠకులు మహేష్ బాబుని ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ మాన్ గా ఎన్నుకున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద బాలీవుడ్ నటుల్నిఅధిగమించి మహేష్ మొదటి స్థానాన్ని సాధించారు. ఈ విషయంపై ఆయన అనందాన్ని వ్యక్తం చేసారు.

ప్రస్తుతం తమన్నా తో కలసి నటిస్తున్న ‘ఆగడు’ చిత్రం షూటింగ్ లో బిజీ గా వున్నారు. శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మహేష్ బాబుకి 123తెలుగు తరపున హార్దిక శుభాకాంక్షలు.

Exit mobile version