మళయాళ డైరెక్టర్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బన్ని

allu-arjun
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో అంతకన్నా కాస్త ఎక్కువ క్రేజ్ మలయాళంలో కూడా ఉందని చెప్పవచ్చు. కానీ అల్లు అర్జున్ కి ఇంత క్రేజ్ కేవలం తన డబ్బింగ్ సినిమాల ద్వారానే రావడం విశేషం. ఇటీవలే కేరళలోని త్రిస్సూర్ లో జాయ్ ఆలుక్కాస్ షో రూం లాంచ్ కి వెళ్ళిన అల్లు అర్జున్ కి అభిమానులు నీరాజనం పలికారు.

అక్కడి అభిమానుల అభిమానం చూసిన బన్ని మళయాళ డైరెక్టర్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ‘నాకు మలయాలంలో మోహన్ లాల్, మమ్ముట్టి అంటే చాలా ఇష్టం. చాలా మంది లేటెస్ట్ యంగ్ డైరెక్టర్స్ మలయాళ సినిమాని మార్చేస్తున్నారు. వాళ్ళకి నేనో విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే మంచి కథలతో నన్ను కూడా అప్రోచ్ అవ్వమని. నా అభిమానుల కోసం డైరెక్ట్ గా మలయాళంలో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నానని’ అల్లు అర్జున్ తెలియజేశాడు.

ఈ ఆఫర్ తో మలయాళ డైరెక్టర్స్ కథలతో బన్నిని అప్రోచ్ అవుతారేమో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘రేసు గుర్రం’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version