
టాలీవుడ్ లెజండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని ఎరియాల్లోనూ కలెక్షన్స్ వరద కురిపిస్తోంది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఊహించని కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఇండియా మొత్తంగా మొదటి వీకెండ్ లో ఈ సినిమా 7.01 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
ఇండియా మొత్తం ‘మనం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వివరాలు :
నైజాం – 2.67 కోట్లు
సీడెడ్ – 1.06 కోట్లు
వైజాగ్ – 62 లక్షలు
గుంటూరు – 45 లక్షలు
కృష్ణా – 49 లక్షలు
తూర్పు గోదావరి – 36 లక్షలు
పశ్చిమ గోదావరి – 36 లక్షలు
నెల్లూరు – 21 లక్షలు
కర్ణాటక – 64 లక్షలు
నార్త్ ఇండియా – 3 లక్షలు
తమిళనాడు – 12 లక్షలు
ఒరిస్సా – 1 లక్ష
ఇండియా మొత్తం షేర్ – 7. 01 కోట్లు