స్నేహ ఉల్లాల్ తన కెరీర్ ప్రారంభంలో తెలుగులో మంచి విజయాలు సాధించింది. కాని కొంతకాలం తర్వాత తన కెరీర్ పాతాళంలోకి వెళ్ళిపోయింది. స్నేహ ఉల్లాల్ చివరి సారిగా ‘యాక్షన్ 3 డి’ లో నటించింది ఆ తర్వాత ఏ చిత్రంలో కనపడలేదు.
స్నేహ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధ పడడం వల్ల సినిమాలకు కొన్ని రోజులు దూరంగా వుండవలసి వచ్చింది. ఇప్పుడు కోలుకున్న స్నేహ తిరిగి చిత్రాలలో నటించాలనుకుంటుంది. సమాచారం ప్రకారం నిర్మాతలని మంచి అవకాశాలకోసం కలుస్తుంది.
అందం అభినయం కలబోత అయిన స్నేహ తను అనుకున్నట్టుగా విజయం సాధించాలని ఆశిద్దాం.
