
బొమ్మరిల్లు,ఢీ,రెడీ మొదలైన సూపర్హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ని ఏలిన కధానాయిక జెనిలియా.ఆ తరువాత హిందీ కధానాయకుడు రితేష్ దేశ్ముఖ్ ను 2012లో పెళ్లి చేసుకుని ముంబైలో స్థిరపడింది.
ఇటీవల అందిన సమాచారం ప్రకారం దేశ్ముఖ్ కుటుంబానికి జెనిలియా తల్లి కాబోతోందనే శుభవార్త తెలిసి సంబరాల్లో ఉంది.ఈ విషయం మీడియాలో చక్కర్లు కొడుతుండగా రితేష్ దేశ్ముఖ్ స్వయంగా దీన్ని ధ్రువపరిచాడు.
ఒక సినిమా ప్రెస్మీట్ లో మాట్లాడుతూ ఈ విషయమై తాము చాలా ఆనందంగా ఉన్నామని పాపకోసం ఎదురు చూస్తున్నామని అన్నాడు.