
సౌత్ ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ‘ఐ’ సినిమాని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగులో ‘మానోహరుడు’ గా విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే ఉపేన్ పటేల్ – అమీ జాక్సన్ పై భారీ మొత్తంతో ఓ పాటని షూట్ చేసారు.
ఇప్పుడు తాజాగా మరో భారీ సెట్ ని నిర్మించారు. పొల్లాచ్చిలో వేసిన ఈ సెట్ లో ఒక చైనా పార్క్ ని నిర్మించారు. కోటి రూపాయలతో నిర్మించిన ఈ సెట్ ని కోటి రూపాయలతో నిర్మించారు. ఈ సెట్లో ఒక పాటని, కొన్ని కీలక సీన్స్ ని షూట్ చేసారు. ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.