సంగీతంతోనే సమాధానం చెప్పాలనుకుంటున్న తమన్

SS-Thaman
సంగీత దర్శకుడు తమన్ గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదురుకుంటున్నాడు. తన పాటలు అన్ని ఇతర సినిమాల నుండి అనుకరించినవే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పాటలకు సంబంధించిన వీడియోలు పెట్టి మరి తమన్ కాపీ చేసాడని నిరూపిస్తున్నారు. అయితే తనపై వస్తున్న ప్రచారాలతో తమన్ మనస్థాపానికి గురైనట్టు తెలుస్తుంది. తనను తాను నిరూపించుకోడానికి ఎదురుచుస్తున్నాడట.

నిజం చెప్పాలంటే, సినిమా స్క్రిప్ట్స్ మొదలు సన్నివేశాల వరకు అందరూ ఏదో ఒక్క సినిమా నుండి కాపీ చేసినవే పెడుతారు. పెద్ద దర్శకులైన త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగనాథ్ లు కూడా ఇలాంటి విమర్శలు ఎదురుకున్నవారిలో ఉన్నారు.

తమన్, ప్రస్తుతం జూ.ఎన్టీఅర్ నటిస్తున్న ‘రభస’ మరియు రవితేజ నటిస్తున్న ‘పవర్’ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నాడు.

Exit mobile version