మంచు వారబ్బాయికి తెగ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్న సన్నీ లియోన్

sunny-leone
కొద్ది రోజులుగా తన సెక్సీ లుక్స్ తో, హాట్ హాట్ పోజులతో బాలీవుడ్ కుర్రకారుకి హీట్ పుట్టించిన సన్నీ లియోన్ ఇప్పుడు సౌత్ ఇండియన్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. ఇటీవలే విడుదలైన ‘కుల్ఫీ’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన సన్నీ లియోన్ ప్రస్తుతం మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘కరెంట్ తీగ’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఈ భామ మంచు వారబ్బాయి మనోజ్ కి పబ్లిక్ గా తెగ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తోంది. ‘మంచు మనోజ్ హన్డ్సం మరియు నాటీ బాయ్. అలాగే అతని యాక్టింగ్ స్కిల్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని’ సన్నీ లియోన్ తెలిపింది. ప్రస్తుతం కరెంట్ తీగ షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. ఆగష్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version