
సౌత్ ఇండియన్ 61వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక నిన్న చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వెదుఅకకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అందరు స్టార్స్ వచ్చారు. అందులో టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది స్టార్ హీరోస్, హీరోయిన్స్ కూడా హాజరయ్యారు.
అందులో టాలీవుడ్ నుంచి మహేష్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే మహేష్ బాబు సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఒకే చోట కలిసి కాసేపు సందడి చేసారు. ఈ విషయాన్నీ సమంత తన ట్విట్టర్ లో సమంత పోస్ట్ చేసింది.
‘సూపర్బ్ నైట్. త్రివిక్రమ్ సార్ మరియు మహేష్ బాబు లతో అదిరిపోయే చాట్. బాగా నవ్వుకున్నాం. బాణా కాత్తాడి సినిమా చేసిన అథర్వకి అవార్డు ఇవ్వడం చాలా హ్యాపీ గా ఉందని’ సమంత ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
కొంతమంది ఫ్యాన్స్ ఈ ట్వీట్ చూసి సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే మహేష్ బాబు – సమంత మధ్య మంచి రిలేషన్ లేదని అనుకుంటున్నారు. కానీ అందులో వాస్తవం లేదు. ఈ వేడుకలో వీళ్ళిద్దరూ కలిసి బాగా మాట్లాడుకోవడమే కాకుండా త్వరలో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉందనే ఆలోచనని కూడా బయటపెట్టుకున్నారు.
గతంలో మహేష్ బాబు – సమంత కలిసి నటించిన ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకున్నాయి.