
‘పెళ్లి చేసుకుంటాను, కాకపోతే దానికి చాలా టైం ఉంది. ప్రస్తుతం లివ్-ఇన్ రిలేషన్ షిప్ లో హ్యాపీగా ఉన్నాను. ‘ అని అంటుంది గోవా సుందరి ఇలియానా. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో గత కొన్నేళ్ళుగా ఇలియానా సహజీవనం చేస్తుంది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ షికార్లు చేస్తూ మీడియా కంట పడుతున్నారు.
మీ పెళ్లి ఎప్పుడు అని మీడియా ప్రశ్నిస్తే… ‘ పెళ్లి అంటే కమిట్మెంట్, నమ్మకం, లవ్, ఒక వ్యక్తిపై విశ్వాసం కలిగి ఉండడం. నాకు పెళ్లిపై నమ్మకం ఉంది. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కొంచం టైం పడుతుంది. ‘ అని సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం హిందీ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇలియానా. మై తేరా హీరో విజయం తర్వాత సైఫ్ అలీ ఖాన్ సరసన ‘హ్యాపీ ఎండింగ్’ సినిమాలో నటిస్తుంది.