
హీరో సిద్దార్ధ్ నటించిన తాజా తమిళ చిత్రం ‘జిగర్తాండ’. తొలుత ఈ చిత్రాన్ని శుక్రవారం, జూలై 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగులో ‘చిక్కడు దొరకడు’ పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. లక్ష్మి మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. అయితే అనూహ్యంగా విడుదల వాయిదా వేశారు. ఇతర నిర్మాతలకు, పంపిణిదారులకు సినిమా విడుదల చేయడం లేదనే వార్తను స్వయంగా తెలిపిన నిర్మాత కదిరేశన్.. తనకు చెప్పకపోవడంపై హీరో సిద్దార్ధ్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు కూడా తెలుపలేదట.
దర్శకుడు కార్తీక్, నేను. సినిమా టెక్నిషియన్స్ అందరూ ‘జిగర్తాండ’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. కనీసం మాతో మాట మాత్రమైనా చెప్పకుండా విడుదల వాయిదా వేశారు. దీనికి కారణం కొందరు వ్యక్తులు, వారి నీచ రాజకీయాలు. వారు సినిమా విడుదలను మాత్రమే అడ్డుకోగలరు, సినిమా విజయాన్ని కాదు. మంచి సినిమా ఎప్పుడు విడుదల అయినా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ కార్తీక్ & ‘జిగర్తాండ’ టీం. త్వరలో కొత్త విడుదల తేదిని తెలుస్తుంది. ‘ అంటూ సిద్దార్ధ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
తెలుగులో ఈ సినిమాను పంపిణి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అందుకే విడుదల వాయిదా వేశారని సమాచారం.