
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ పొల్లాచ్చిలో మొదలైంది. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ అక్కడే షూటింగ్ జరుపుకొని హైదరాబాద్ తిరిగి వస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులు హైదరాబాద్ లో షూట్ చేస్తారు. ఆ తర్వాత ఈ చిత్ర టీం మొత్తం లాంగ్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నారు.
రామ్ చరణ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చరణ్ కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుందని ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. మొత్తం 5 పాటలు ఉండే ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని జూలై 28న రిలీజ్ చేయనున్నారు.