
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి త్రిష ఒక పిటీషన్ పెట్టింది. ఇటివల ఢిల్లీ జూలో జరిగిన సంఘటనలో తెల్ల పులి విజయ్… ఒక యువకుడిని చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ పులిని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు జూకి తరలివస్తున్నారు. మరోవైపు ఆ పులిని జూ అధికారులు చంపేస్తారు అని వచ్చిన వార్తలు జంతు ప్రేమికులను షాక్ కి గురి చేశాయి. ఆ వార్త పట్ల త్రిష కూడా ఆవేదన చెందింది. తెల్ల పులి విజయ్ కు మద్దతుగా చేంజ్ అనే స్వచ్చంద సంస్థ ప్రారంభించిన పిటీషన్ కు తన మద్దతు తెలిపింది. మూగ జీవాలంటే త్రిషకు చెప్పలేని ప్రేమ. పెటా సంస్థ తరుపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అనేక కార్యక్రమాలకు కూడా హాజరయింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రిష తెలుగులో బాలకృష్ణ సరసన ఒక సినిమాలో నటిస్తుంది. కొన్ని రోజులు షూటింగ్ లో కూడా పాల్గొంది. ఈ సినిమాతో సత్యదేవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.