
బుల్లితెరపై స్టార్ యాంకర్స్ లో ఒకరుగా చెలామణీ అవుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్ అనసూయ. అనసూయకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. చాలా కాలం నుంచి అనసూయకి సినిమాలో ఆఫర్ వచ్చింది కానీ తనే తిరష్కరించిందంటూ పలు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తనే త్వరలో సినిమాల్లో నటించనున్నానని తెలిపింది.
విజయదశమి సందర్భంగా నిర్వహించిన ఓ టీవీ షోలో త్వరలో తను సినిమా చేయనున్నట్లు తెలియజేసింది. అలాగే ఆ సినిమాలో తనే లీడ్ రోల్ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిప్రకారం అనసూయని త్వరలోనే వెండితెరపై చూడవచ్చు. మరి ఇప్పటి వరకూ బుల్లితెరపై మంచి పేరున్న అనసూయ వెండితెరపై కూడా తన టాలెంట్ నిరూపించుకుంటుందేమో చూడాలి..