
లెజెండ్రీ సింగర్ యేసుదాసు మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న యేసుదాసు… అమ్మాయిలు, మహిళలు జీన్స్ భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్దం, వారు జీన్స్ వేసుకుని ఇతరులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరాడంబరత భారత స్త్రీలో గొప్ప లక్షణం… జీన్స్ ధరించడం మాని నిండైన వస్త్రధారణతో మెలగాలని సూచించారు.
యేసుదాసు వ్యాఖ్యల పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వారి ఇష్టం, వాటిపై ఆంక్షలు విధించడం తగదు అని అంటున్నారు. ఎన్నో గొప్ప పాటలు పాడి, దేశం గర్వించదగ్గ గాయకుడిగా పేరు సొంతం చేసుకున్న యేసుదాసు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిమానులు. ప్రజలు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.