రేణు దేశాయ్ దర్శకురాలిగా మారి తొలి ప్రయత్నంగా నిర్మించిన సినిమా ‘ఇష్క్ వాలా లవ్’. మరాఠీలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి సందర్భంగా ఈ సినిమా తెలుగు ఆడియోను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేశారు.
ఈ ఆడియోలో మొత్తం 9 పాటలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఖుషి, పులి సినిమాల దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు పాటలను కంపోజ్ చేశారు. మిగతా పాటలకు అవినాష్ – విశ్వతేజ ద్వయం, ఒక పాటకు సాగర్ మాధుర్ సంగీతం అందించారు. వెన్నెలకంటి, భువన చంద్ర, చంద్రబోస్, రాకేందు మౌళి, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.
అకిరా ఫిల్మ్స్ బ్యానర్ పై రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ అతిధి పాత్రలో నటించాడు. త్వరలో ఈ సినిమాకి సంబందించిన వివరాలు వెల్లడికానున్నాయి.
