
మంచు ఫ్యామిలీ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో నటించిన తర్వాత తనీష్ మరొక సినిమాలో నటించలేదు. 2013లో సోలో హీరోగా ‘మేం వయసుకు వచ్చాం’తో హిట్ కొట్టాడు తనీష్. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో కథ, స్క్రిప్ట్ తనకు నచ్చితేనే సినిమా అంగీకరిస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత విజయదశమి రోజున కొత్త సినిమాను ప్రారంభించాడు.
శివగణేష్ దర్శకత్వంలో ‘మీకో ప్రేమకథ చెప్పాలి’ అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మూడు జంటల ప్రేమకథ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ మరొక హీరోగా నటిస్తున్నాడు. కూనిరెడ్డి శ్రీనివాస్, శివగణేష్ లు నిర్మాతలు.
ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో, డిఫరెంట్ స్క్రీన్-ప్లేతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకు నాకు తెలిసి ఇలాంటి కథతో సినిమా రాలేదు. ‘మీకో ప్రేమకథ చెప్పాలి’ నా కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది’ అని తనీష్ చెప్పారు. శ్రీ మాస్