ఇంటర్వ్యూ : పూరి జగన్నాధ్ – గోపి గణేష్ నా ఫస్ట్ మూవీ కంటే 10 రెట్లు బెటర్ గా తీసాడు.!

Puri
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా పూరి కథ – డైలాగ్స్ అందించిన ‘రోమియో’ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను, సినిమా కథకి సంబందించిన విషయాలను మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా మిమ్మల్ని ‘రోమియో’ కథ రాయడానికి స్పూర్తినిచ్చిన అంశం ఏమిటి.?

స) ఈ సినిమాకి స్ఫూర్తి అంటే నేను నా రాక్షసి సినిమా షూటింగ్ కోసం వేనీస్ వెళ్లాను అక్కడ వెరోన అనే ప్లేస్ ఉంది. రోమియో – జూలియట్ నివసించిన ప్లేస్ అది. అక్కడ జూలియట్ స్టాచ్యూ ఉంది.ప్రేమికులంతా వారి లవ్ సక్సెస్ అవ్వాలని అక్కడ ప్రార్ధనలు చేస్తుంటారు. ఆ టైంలో అవన్నీ చూసి రాసిన కథ ఇది. అంటే 4 సంవత్సరాల క్రితమే ఈ సినిమా కథ రాసాను.

ప్రశ్న) ‘రోమియో’ కథ గురించి చెప్పండి.? అలాగే 4 సంవత్సరాల క్రితం రాశాను అన్నారు. మరి ఇప్పటి ప్రేక్షకులకు నచ్చుతుందా.?

స) రోమియో అనేది ఒక క్యూట్ అండ్ ట్రూ లవ్ స్టొరీ. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకూ చాలా ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటుంది. అలాగే కొంత సెంటిమెంట్, కొంత ఎమోషనల్ గా కూడా ఉంటుంది. నేను 4 సంవత్సరాల క్రితమే కథ రాసినప్పటికీ సినిమా ఇప్పటి వారికి బాగా నచ్చుతుంది.?

ప్రశ్న) ‘రోమియో’లో రవితేజ చేసిన అతిధి పాత్ర గురించి చెప్పండి.?

స) కథ అనుకున్నప్పుడే ఈ పాత్ర ఉంది. సాయిరామ్ శంకర్ కి బ్రదర్ పాత్రలో రవితేజ కనిపిస్తాడు. రవితేజది అతిధి పాత్రే అయినప్పటికీ ఉన్నతలో ఎంటర్టైన్ చేసి కథని టర్న్ తిప్పే పాత్ర.

ప్రశ్న) ఫైనల్ కాపీ చూసారా.? మీరు ఎంతో ఇష్టపడి రాసుకున్న ఈ కథకి గోపి గణేష్ ఎంత వరకూ న్యాయం చేసాడు.?

స) రోమియో ఫైనల్ కాపీ చూసాను. సినిమా చాలా బాగా వచ్చింది. గోపి గణేష్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా తీసాడు. చెప్పాలంటే నేను నా మొదటి సినిమా తీసిన దానికంటే గోపి 10 రెట్లు బాగా చేసాడు. రోమియో స్పెషాలిటీ ఏమిటంటే.. కేవలం 16 మంది టీంతో రోమ్, స్విట్జర్ ల్యాండ్, వైజాగ్ లలో అనుకున్న టైంలో తీసారు. గోపి ఇంత తక్కువ టీంతో ఇంత సూపర్బ్ గా మేకింగ్ ఉంటుందని అనుకోలేదు.

చెప్పాలంటే ఇలా తక్కువ పాత్రలతో రాసుకున్న బొటిక్ మూవీస్ తీయాలంటే నాకు ఇష్టం. మొదట్లో నేనూ ఇలానే తీసే వాడిని కానీ ఇప్పుడు నిర్మాతలు డబ్బు ఎక్కువ పెట్టడం వల్ల కుదరడం లేదు. ఒకరోజు దాసరి గారు నాతో అన్నారు. ‘ఎప్పుడు పెద్ద హీరోలతోనే కాదు చిన్న సినిమాలు కూడా చెయ్యి, ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు పెద్ద హీరోల అవకాశం ఇవ్వని సందర్భం వస్తుంది, అప్పుడు చిన్న సినిమా నీకు కొత్త కాకూడదు. అలాగే 100 చిన్న సినిమాల వల్ల ఇండస్ట్రీ రన్ అవుతుంది కానీ, 10 పెద్ద సినిమాల వల్ల కాదని’ ఆయన అన్నాడు. ఆయన చెప్పింది అక్షర సత్యం.

ప్రశ్న) సాయిరామ్ శంకర్ కోసమే ఈ కథ రాశారా.? సాయి కెరీర్ కి ఈ సినిమా హెల్ప్ అవుతుందా.?

స) సాయి కోసమే ఈ సినిమా చేసాను. కానీ నాకు కుదరకపోవడం వలన అదే టైంలో గోపి డైరెక్టర్ అవ్వాలని చూస్తుండడం చూసి ఈ కథ ఇచ్చి తీయమన్నాను. ఇక కెరీర్ కి హెల్ప్ అంటే .. నా పరంగా హిట్ అయితే అన్నీ హెల్ప్ అవుతాయి. లేదంటే లేదు.. అలాగే ఈ సినిమాలో సాయి లుక్ నాకు గత సినిమాల కంటే చాలా బాగా నచ్చింది.

ప్రశ్న) ఈ సినిమాలోని మేజర్ హైలైట్స్ ఏమిటి.?

స) నా వరకూ లవ్ స్టొరీ చాలా కొత్తగా ఉంటుంది. విజువల్స్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. అలాగే సునీల్ కశ్యప్ ఆడియో కూడా సినిమాకి వన్ అఫ్ ది హైలైట్ అవుతుంది.

ప్రశ్న) మొదటి సారి మీరు మీ కథ కాకుండా వక్కంతం వంశీ కథతో సినిమా చేయడానికి గల కారణం ఏమిటి.?

స) ఎన్.టి.ఆర్ తో ప్రస్తుతం చేస్తున్న కథ కంటే నేను ముందే ఓ కథ చెప్పాను. అది సెట్స్ పైకి వెళ్ళడానికి ముందు వక్కంతం వంశీ చెప్పిన లైన్ నాకు తారక్ చెప్పాడు. అది నచ్చి పూర్తి స్క్రిప్ట్ విందామని వంశీని పిలిపించి కథ విన్నాను. నేను రాసిన కథ కంటే వంశీ చెప్పిన కథ బాగా నచ్చడంతో దానిమీద వర్కౌట్ చేసి సెట్స్ పైకి వెళ్ళాము.

ప్రశ్న) ఎన్.టి.ఆర్ సినిమా విశేషాలు చెప్పండి.?

స) ప్రస్తుతం డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. ఇదొక కాప్ స్టొరీ.. మధ్యలో ఓ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నాం. ఒక నెల గ్యాప్ వచ్చింది, దాన్ని కవర్ చేస్తూ రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నాం. కచ్చితంగా జనవరి 9న రిలీజ్ చేస్తాము. అలాగే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫైనలైజ్ చెయ్యలేదు. బయట వస్తున్న రూమర్స్ నమ్మవద్దు.

ప్రశ్న) మీ బ్యానర్ లో సినిమాలు చేయడం తగ్గించేసారు.? దానికి కారణం.?

స) ఇది వరకూ అన్నట్టు.. వచ్చే సంవత్సరం నుంచి కొత్త రైటర్స్ మరియు దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటున్నాను. దాని గురించి త్వరలోనే ఓ అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను. యంగ్ టాలెంట్ తమ దగ్గర ఉన్న లైన్స్ ని పంపితే అది నాకు నచ్చితే ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని సినిమా చేస్తాను.

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. మీరు క్లారిటీ ఇస్తారా.?

స) ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సినిమా బిజీ బిజీ, ఇది అవ్వగానే మహేష్ బాబుతోనే ఉంటుంది. కథ రెడీ చేసాను, మహేష్ బాబు బిజీగా ఉండడం వలన ఇంకా వినలేదు. ఆ తర్వాత కూడా మూడు నాలుగు కమిట్ మెంట్స్ ఉన్నాయి. రానాది కూడా అందులో ఒకటి.

అంతటితో పూరి జగన్నాధ్ తో ఇంటర్వ్యూని ముగించి, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము.

Exit mobile version