
దేశంలో లేదా రాష్ట్రంలో ఏ ప్రకృతి విపత్తు జరిగినా నేనున్నా అంటూ ముందుకు వచ్చే తెలుగు హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే జరిగిన హుదూద్ సైక్లోన్ సృష్టించిన ప్రళయంలో దెబ్బతిన్న విషయంలో కూడా అపవాన్ కళ్యాణ్ ఇలాగే స్పందించారు. మొదటగా తన తరపున 50 లక్షల అమౌంట్ ని సిఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేసారు. ఆ తర్వాత తానె స్వయంగా వైజాగ్ వెళ్లి బాధితులను పరామర్శించనున్నట్లు తెలిపారు.
అన్నట్టుగానే ఈ రోజు ఉదయమే పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా వైజాగ్ కి బయలు దేరాడు. రానున్న రెండు రోజుల్లో వైజాగ్ మరియు ఉత్తరాంధ్రలో కూడా పర్యటించనున్నాడు. ఈ రోజు వైజాగ్ చేరుకొని అక్కడే అందరినీ పరామర్శించి, సహాయక చర్యల్లో పాల్గొననున్నాడు.
పవన్ కళ్యాణ్ కాకుండా మంచు మనోజ్ కూడా నిన్ననే వైజాగ్ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడి వెళ్ళలేని పలువురు విరాళాలు ఇచ్చి తమ సహాయాన్ని అందించారు.