నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న నాగ్ కొత్త మూవీ

nagarjuna
‘మనం’ సూపర్ హిట్ సినిమా తర్వాత నాగార్జున వెండితెరకి గ్యాప్ ఇచ్చిన కింగ్ నాగార్జున బుల్లితెరపై చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో లో బిజీ గా ఉన్నాడు. ఫస్ట్ సీజన్ పూర్తయి రెండవ సీజన్ మొదలవడానికి అన్నీ సిద్దం అవుతుండడంతో నాగార్జున ఇప్పుడు మళ్ళీ సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. అందులో ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా ఖరారు చేసాడు. తాజాగా కార్తీతో కలిసి చేయనున్న వంశీ పైడిపల్లి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా రమ్యకృష్ణని ఖరారు చేయగా మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. రాధా మోహన్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు.

Exit mobile version