‘పూజ’ సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న విశాల్

pooja (1)
తమిళ హీరో విశాల్ హీరోగా నటించిన మరో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’. తమిళంలో పూజై గా రిలీజ్ కానున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 22న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా విజయంపై విశాల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ‘హరి దర్శత్వం వహించిన ఇతర సినిమాల్లానే ఇది కూడా చాలా వేగంగా సాగే థ్రిల్లర్ మూవీ. బీహార్ లో జరిగిన మూడు డిఫరెంట్ కథలు హీరో హీరోయిన్స్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా కచ్చితంగా కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నానని’ విశాల్ అన్నాడు.

‘యముడు’, ‘సింగం’ సినిమాల డైరెక్టర్ హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ సరసన బ్యూటిఫుల్ శృతి హాసన్ జోడీ కట్టింది. ఈ సినిమాలో శృతి హాసన్ పూర్తి గ్లామరస్ లుక్ లో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మరియు ఫోటోలలో శృతి హాసన్ గ్లామర్ డోస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విశాల్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.

Exit mobile version