
‘జెంటిల్ మెన్’, ‘ఒకే ఒక్కడు’, ‘హనుమాన్ జంక్షన్’ మొదలైన సూపర్ హిట్ సినిమాలతో తెలుగు వారికి బాగా పరిచయమున్న యాక్షన్ కింగ్ అర్జున్ కొత్త సినిమా ‘జైహింద్ 2′. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఆడియోని నిన్న హైదరాబాద్ లో లాంచ్ చేసారు. గతంలో సూపర్ హిట్ అయిన ‘జై హింద్’ సినిమాకి ఇది సీక్వెల్.
ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలోని సమస్యలను ఆధారంగా చేసుకొని దానికి కమర్షియల్ అంశాలను జోడించి ఈ సినిమాని తీసారు. మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్ కలాం రాసిన ఓ ఆర్టికల్ ని చూసి స్పూర్తిగా తీసుకొని ఈ సినిమా చేసిన అర్జున్ ఆయనకే ఈ సినిమాని అంకితం ఇస్తున్నాడు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ భాధ్యతలతో పాటు నిర్మాణ భాద్యత కూడా అర్జున్ తీసుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చివరి దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. చెన్నై, ముంబై, ఢిల్లీ మరియు పలు ఇంటర్నేషనల్ లోకేషన్స్ లో షూట్ చేసిన ఈ సినిమాకి అర్జున్ జన్య మ్యూజిక్ అందించాడు.