దాసరి – విష్ణుల ‘ఎర్రబస్సు’ ఆడియో రిలీజ్ డేట్

errabasuu
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తూ, ముఖ్య పాత్ర పోషిస్తున్న సినిమా ‘ఎర్రబస్సు’. మంచు విష్ణు హీరోగా కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దాసరి నారాయణరావు ఈ సినిమాని చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీం ఈ మూవీ ఆడియోని అక్టోబర్ 31న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు.

అలాగే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో విష్ణుని అతిధి పాత్ర మాత్రమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలని దాసరి ఖండించారు. ‘విష్ణు పాత్ర సినిమాలో ఫుల్ లెంగ్త్ ఉంటుంది. ఇద్దరికీ ఫుల్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది. నా పాత్ర కంటే ముందు నుంచే విష్ణు పాత్ర పరిచయం అవుతుంది. ఆ తర్వాతే నేను వస్తాను. విష్ణు కెరీర్లో ఎర్రబస్సు లో చెఇస్న పెర్ఫార్మన్స్ ది బెస్ట్ అవుతుందని’ అన్నాడు.

ఈ సినిమాలో దాసరి – మంచు విష్ణు తాత మనవళ్లుగా గా కనిపించనున్నారు. తమిళంలో హిట్ అయిన ‘మంజపై’ అనే సినిమాకి ఇది రీమేక్. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, అలీ, కృష్ణుడు, రఘుబాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి చక్రి సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version