నేడు ‘కత్తి’ మూవీ చూడనున్న పవన్ కళ్యాణ్

PawanKalyan
తమిళ సూపర్ స్టార్ ఇలయథలపథి విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమా అక్టోబర్ 22న దీపావళి కానుకగా తమిళంలో విడుదలై సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కూడా కురిపిస్తోంది. ఈ సినిమాని ముందుగా తెలుగులో డబ్ చేద్దాం అనుకున్నారు కానీ అక్కడ సినిమా హిట్ అవ్వడంతో ఇక్కడ రీమేక్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు.

ఈ కత్తి తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అవి నిజం అనే పవన్ సన్నిహితులు అంటున్నారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ రోజు పవన్ కళ్యాణ్ నిర్మాత ఠాగూర్ మధు కలిసి కత్తి సినిమాని చూడనున్నారు. పవన్ కళ్యాన్ ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోషల్ మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్కువ భాగం ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే అంటున్నారు.

విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ మురుగదాస్ డైరెక్టర్. అనిరుదు రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version