‘బాహుబలి’తో చారిత్రాత్మక సినిమాలకు రాజమౌళి ఫుల్ స్టాప్..?

rajamouli

‘యమదొంగ’, ‘మగధీర’ సినిమాలతో రాజమౌళి చారిత్రాత్మక సినిమాలను అద్బుతంగా తీయగలడని పేరొచ్చింది. అతనిపై నమ్మకంతో ‘బాహుబలి’ సినిమాకు నిర్మాతలు సుమారు 180 కోట్ల ఖర్చుపెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ స్టిల్స్, బర్త్ డే టీజర్ లు చారిత్రాత్మక కథలను తెరకెక్కించడంలో రాజమౌళి విజన్, టాలెంట్ ను చాటిచెప్పాయి. అయితే ‘బాహుబలి’ తర్వాత చారిత్రాత్మక సినిమాలు తీయడం ఆపేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్టు, ఆయన సన్నిహిత వర్గాలు ఫిల్మ్ నగర్ ప్రముఖులతో వ్యాఖ్యానించినట్టు భోగట్టా.

ఇండస్ట్రీలో రాజమౌళికి జక్కన్న అనే ముద్దుపేరు ఉంది. ప్రతి సినిమాను శిల్పంలా చేక్కుతాడని ఆ పేరు పెట్టారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను తీయడానికి రాజమౌళికి ఒక ఏడాది కాలం పడుతుంది. అదే చారిత్రాత్మక నేపధ్యం ఉన్న సినిమా అయితే రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. రెండేళ్ళ పాటు ఆర్టిస్టుల కాల్ షీట్స్ దొరకడం ఒక సమస్యగా మారింది. ముఖ్యంగా ఒక స్టార్ హీరోను చాలా రోజుల పాటు అభిమానులకు దూరంగా పెట్టవలసి వస్తుంది. మరోవైపు రాజమౌళితో పని చేయాలనే హీరోల సంఖ్య పెరిగిపోతుంది. అందుకే ‘బాహుబలి’ తర్వాత చారిత్రాత్మక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే నిర్ణయం తీసుకునట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో నిజం ఎంత ఉందొ తెలియాలంటే రాజమౌళి పెదవి విప్పాల్సిందే.

Exit mobile version