సుకుమార్ నిర్మాతగా రాజ్ తరుణ్ కొత్త సినిమా..!

sukumar2

డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా తన శిష్యుడు వేమారెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ‘చక్కిలిగింత’ అనే పేరు పరిశీలనలో ఉంది. సహజీవనం నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే రెండో సినిమా పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు సుకుమార్.

‘ఉయ్యాలా జంపాలా’తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ హీరోగా ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోయే ఈ సినిమాకు ‘1 నేనొక్కడినే’, ‘రోబో’ సినిమాలకు వర్క్ చేసిన రత్నవేలు సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. నవంబర్ 9 నుండి చిత్రీకరణ ప్రారంభమవుతుంది. త్వరలో ఈ సినిమా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Exit mobile version