ఆహుతి ప్రసాద్ అంత్య క్రియల విశేషాలు

ahuti-prasad
తెలుగులో ఎన్నో మరపురాని పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించిన ఆహుతి ప్రసాద్ ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడవడంతో ఆయన కుటుంబమే కాకుండా, సినీ పరిశ్రమ కూడా శోఖ సముద్రంలో మునిగింది. ఇప్పుడే కిం హాస్పిటల్ నుంచి ఆహుతి ప్రసాద్ మృతదేహాన్ని ఫిల్మ్ నగర్లోని తన నివాసానికి చేర్చారు.

సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఇప్పటికే ఆయన ఇంటికి చేరుకొని ఆహుతి ప్రసాద్ కి నివాళులర్పించారు. ఈ రోజు అంతా ఇంటి దగ్గరే ఉంచి రేపు ఆయన దహన క్రియలు చేయనున్నారు. ఈ అంత్యక్రియల కంటే ముందు రేపు ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ఫిల్మ్ నగర్లో తెలుగు ప్రేక్షకుల దర్శనార్ధం ఉంచనున్నారు. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు ఎర్రగడ్డ స్మశాన వాటికలో చేస్తారు.

Exit mobile version