ఫ్యాన్స్ కి నూతన ఉత్తేజాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, విక్టరీ వెంకటేష్ అభిమానులు, తెలుగు చినీఎ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ సినిమా ఆడియో నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళవేదికలో జరిగింది. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఓపెన్ గా మాట్లాడుతూ అభిమానులను తను ఎంత ఆరాదిస్తాడో అనే విషయాలను తెలిపి అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాడు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ నాకు చిన్నప్పటి నుంచి ఏం కావాలో తెలిసేది కాదు అందుకే అప్పట్లో నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అడవుల్లోకి వెల్లిపోదాం అనుకున్నాం. అప్పుడే అన్నయ్య(చిరంజీవి) ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. అలా అనుకోకుండా హీరోని అయ్యాను. నేను చేసిన సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. కానీ ఖుషి టైంలో నాకు ముందు ముందు గడ్డు కాలం ఉందని అనిపించింది. ఆ తర్వాత వరుస పరాజయాలు వచ్చాయి. ఆ టైములో చాలా మంది ఫ్యాన్స్ అన్న ఒక్క హిట్ ఇవ్వన్నా చచ్చిపోతున్నాం అనడిగేవారు. కానీ అది నా చేతుల్లో లేనిది, అది ఆ దేవుడే ఇవ్వాలి. అందుకోసమే దేవుడిని మొదటిసారిగా ఒక హిట్ ఇవ్వమని కోరుకున్నాను. అదికూడా నన్ను ఇంతలా ఆరాధించే మీ కోసమే’ అని అన్నారు. ఆయన హృదయాంతరాల్లో నుంచి వచ్చిన మాటలను చెప్పేటప్పుడు ఆయన కళ్ళు కూడా చెమర్చాయి. ఈ స్పీచ్ అభిమానులను ఎంతో కదిలిచడమే కాకుండా వారిలో నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది.

గోపాల గోపాల సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి కిషోర్ కుమార్ పర్ధసాని డైరెక్టర్.

వీడియో కోసం క్లిక్ చేయండి

Exit mobile version