క్రేజీ కాంబోతో వస్తున్న సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్..!

SDT19

సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ తన నెక్స్ట్ చిత్రం ‘SDT19’ గురించి అఫీషియల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రానికి ‘క’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శక ద్వయం సుజిత్ మరియు సందీప్ ఎమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇందులో సాయి దుర్గా తేజ్ దట్టమైన అడవిలో ఆకాశం వైపు చూస్తున్న ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. ఆయన ముందు ఒక రహస్యమైన పర్వతం కనిపిస్తుండటంతో, ఇది ఒక ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది.

ఈ సినిమా సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో చాలా స్పెషల్ కానుందని.. ఎందుకంటే ఆయన తన సొంత నిర్మాణ సంస్థ ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ను ఈ ప్రాజెక్ట్‌తోనే ప్రారంభిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన నటీనటులు మరియు ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Exit mobile version