
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని పూణేలో నివసిస్తున్న రేణు దేశాయ్ నిర్మాత అవతారమెత్తారు. ఇటీవల ఆమె నిర్మించిన ఒక మరాఠీ చిత్రం కూడా విడుదలైంది. అయితే రెండు దేశాయ్ సోషల్ నెట్వర్కింగ్ లలో తరచూ తన భావాలను వ్యక్తీకరిస్తారు. కాకపోతే ఆమె ఏ ట్వీట్ చేసినా, ఎవరికి కామెంట్ చేసినా అది పవన్ మెప్పు పొందాలని ఇవన్నీ చేస్తున్నట్టు కొందరు అవుత్సాహికులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీంతో విసిగిపోయిన రేణు తనదైన శైలిలో స్పందించింది
‘నా కూతురు ఆద్య కోసం ఓ కవిత రాశా. అంతే తాను పవన్ కు దగ్గరవుతున్నానంటూ కొందరు సానుభూతి చూపారు. ఇటీవలే సోషల్ నెట్వర్కింగ్ పై స్పందించాను. అది కూడా పవన్ కోసమే అనుకున్నారు, దీనిపై పలు రకాల ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇక చాలు, నేను ఏం చేసినా పవన్ కోసమే అంటే ఎలా ? ఇకపై పవన్ గురించి వేసే ప్రశ్నలకి స్పందించను. నేను రోబోను కాదన్న విషయం గుర్తించుకోవాలి. నాకు వ్యక్తిత్వం, అభిరుచులున్నాయి’ అని రేణు ట్వీట్ చేశారు.