ప్రేమికుల రోజు కానుకగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’

Krishnamma-Kalipindi-Eddari

‘ప్రేమకథా చిత్రమ్’ తో హిట్ అందుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ప్రేమ కథా చిత్రమ్ లో సుధీర్ తో జత కట్టిన నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఆర్.చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ నేటితో ముగియనుంది. అనగా నేటితో ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

హరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని జనవరి 21న విడుదల చేయనున్నట్లు ఇది వరకే తెలియజేశాం. అంతే కాకుండా ఈ చిత్ర టీం ఈ బ్యూటిఫుల్ లవ్ స్టొరీని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 2వ వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగ చైతన్య, దగ్గుబాటి రానా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడంలో మంచి విజయం సాదించిన ‘చార్మినార్’ ఈ చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది.

Exit mobile version